Magazines

ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మ‌ర‌ణం

17 సెప్టెంబర్, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బిడ్డ‌కు పెండ్లి కుదుర‌డంతో ఘ‌నంగా వివాహం చేసి అత్తారింటికి పంపాల‌నుకున్నా ఆ తండ్రి ఆశ‌లు అడియాస‌లయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మ‌ర‌ణం చెంద‌డ‌తో మంగ‌ళ‌వాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడ‌ప్పు కొట్టాల్సి వ‌చ్చింది. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ ప‌ల్లి ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..తండ్రి, కుమార్తె మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురును వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన టిప్ప‌ర్ ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌తి చెందారు.

కుమార్తెకు పెళ్లి ఖాయంకావ‌డంతో సామాన్లు తీసుకురావానికి బైక్‌పై తండ్రి కూతురు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో వేగంగా వ‌చ్చిన టిప్ప‌ర్ వారి బైక్‌ను వెను క‌నుంచి ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్