Magazines

కర్రెగుట్టలో విషాదం.. మందుపాతర పేలి వ్యక్తి మృతి

03 సెప్టెంబర్, 2026

man died

man died

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో పాత మందుపాతర పేలి ఓ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెదురు కాలనీకి చెందిన నాగేశ్వరరావు (35) వెదురు బొంగుల సేకరణ కోసం కర్రెగుట్టల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గతంలో మావోయిస్టులు అమర్చినట్లుగా భావిస్తున్న మందుపాతరపై ఆయన కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ధాటికి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగగా, మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కేంద్రంగా ఉండేదని, వారు అప్పట్లో అమర్చిన మందుపాతరలు ఇంకా భూమిలో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా ఇదే ప్రాంతంలో మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా ఓ జవాన్ గాయపడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్