Magazines

గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

2 రోజుల క్రితం

gas-cylinder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీ నిలిపివేయబడనుంది. బీఏఏ పూర్తి చేసే వరకు సబ్సిడీపై రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, కనెక్షన్ రద్దు లేదా గ్యాస్ నిలిపివేత ఉండదు. అవసరమైతే, 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. బీఏఏ పూర్తి చేసిన వెంటనే సబ్సిడీ రీఫిల్ సౌకర్యం పునరుద్ధరిస్తారు. తెలంగాణలో 88 శాతం మంది బీఏఏ పూర్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్