ఆందోళన అనేది మనసు, శరీరం రెండింటినీ ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ఆందోళన సమస్యల కోసం చికిత్స అవసరమైనప్పటికీ.. సాధారణ జీవనశైలి మార్పులు కూడా మానసిక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయని అంటున్నారు. అలాంటి అలవాట్లలో నడక ఒకటని చెబుతున్నారు. ఇందుకు జిమ్, జిమ్ పరికరాలు అవసరం లేకుండా చేయవచ్చట. సాధారణ వేగంతో నడవడం వల్ల కూడా శరీరం మరింత చురుగ్గా మారడమే కాకుండా, మనసుకు మంచి ఉపశమనం లభిస్తుందని తెలియజేస్తున్నారు.
ఒత్తిడి నివారణ అన్వేషించండి
శారీరక కదలికలతో పాటు దైనందిన ఒత్తిళ్లకు కాస్త దూరంగా ఉంచడంలో నడక ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. అంతేకాకుండా, నడకను ఎలాంటి ఫిట్నెస్ స్థాయి వారైనా సులభంగా అలవాటు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. బయట, ఇంటి చుట్టుపక్కల లేదా ఇంటి లోపల అయినా సరే కొద్దిసేపు నడవడం వల్ల శరీరాన్ని కదిలించడానికి, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడానికి, మనసును ప్రశాంత పరుచుకోవడానికి ఒక మంచి అవకాశం లభిస్తుందని సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
నడక అనేది ఒత్తిడి వల్ల కలిగే శారీరక ప్రభావాలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన ఒత్తిడి, అలసట తొలగిపోతాయని అంటున్నారు. దీనివల్ల నడక ముగిసిన తర్వాత మరింత ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారట. నడకను రోజువారీ అలవాటుగా మార్చుకోవడం వల్ల, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను శరీరం మరింత సమర్థవంతంగా తట్టుకోగలదని తెలియజేస్తున్నారు. కనీసం 20 నుంచి 30 నిమిషాలు ప్రకృతిలో నడవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
శారీరక శ్రమ చేయడం వల్ల మెదడులో మానసిక స్థితిని, శ్రేయస్సును పెంచే సంతోషకరమైన రసాయనాలు విడుదలవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, క్రమం తప్పకుండా నడవడం వల్ల, అది సహజంగానే మూడ్ను పెంచే ఒక అద్భుతమైన బూస్టర్లా పనిచేస్తుందని చెబుతున్నారు. కొంతమంది కాసేపు నడిచినా సరే.. అది ప్రతికూల లేదా పదే పదే వచ్చే ఆలోచనల సుడిగుండం నుంచి సులభంగా బయటపడటానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. వారానికి కొన్నిసార్లు వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుందని, ఇంకా తేలికపాటి డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది.
దృష్టిని మళ్లిస్తుంది
ఆందోళనలో ఉన్నప్పుడు ఒకే విధమైన సమస్యల గురించి పదే పదే ఆలోచించడం కామన్. అయితే నడక అనేది దృష్టిని, ఆ ఆలోచనల నుంచి మరొక వైపుకు మళ్లించడానికి అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నడిచేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం, శ్వాస, శరీరం కదలికలు లేదా కేవలం నడిచే దారిపై దృష్టి పెట్టవచ్చని సూచిస్తున్నారు. ఈ విధమైన మార్పు ఆందోళన కలిగించే ప్రతికూల ఆలోచనల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుందని సలహా ఇస్తున్నారు. సైకిల్ తొక్కడం, డ్యాన్స్ క్లాస్, లేదా వేగంగా నడవడం వంటివి దీర్ఘకాలిక ఆందోళనతో బాధపడేవారికి శక్తివంతమైన సాధనంగా ఉంటాయి.
బయట నడవడం వల్ల
బయట నడవడం వల్ల లభించే సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, మారుతున్న పరిసరాలు మనసుకు అదనపు ఉత్సాహాన్ని ఇస్తాయట. ప్రకృతి వాతావరణంలో సమయాన్ని గడపడం వల్ల మానసిక ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. రోజువారీ ఒత్తిడి లేదా తేలికపాటి ఆందోళనను ఎదుర్కొంటున్న వారికి పార్కులో లేదా ప్రశాంతమైన బహిరంగ ప్రదేశంలో నడవడం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్రకు తోడ్పడుతుంది
ఆందోళన, నిద్రలేమి అనేవి ఒకదానికొకటి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పగటిపూట ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మరింత సులువవుతుందని అంటున్నారు.
శ్వాసక్రియను క్రమబద్ధీకరించడంలో
ఆందోళనలో ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీకు సౌకర్యవంతంగా ఉండే వేగంతో నడవడం వల్ల మీ శరీర కదలికలకు, శ్వాసకు మధ్య ఒక స్థిరమైన లయ ఏర్పడుతుందని అంటున్నారు. నడుస్తున్నప్పుడు నెమ్మదిగా, క్రమబద్ధంగా తీసుకునే శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ఈ నడకను ఒక అద్భుతమైన మైండ్ఫుల్నెస్ వ్యాయామంగా మార్చుకోవచ్చని తెలియజేస్తున్నారు.
స్క్రీన్ల నుంచి కాస్త దూరంగా
ఫోన్లు, సోషల్ మీడియా, వార్తలు, ఆఫీస్ మెసేజ్లను నిరంతరం చూడటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నడక అనేది ఇలాంటి డిజిటల్ స్క్రీన్ల నుంచి కాస్త దూరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందని సూచిస్తున్నారు. నడిచేటప్పుడు ఫోన్ను ఇంట్లోనే వదిలి వెళ్లడం లేదా కేవలం పాటలు వినడానికి లేదా దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల నడక అనేది మనసుకు ఒక చక్కటి డిజిటల్ డిటాక్స్ లాగా పనిచేస్తుందని సలహా ఇస్తున్నారు.
ఎంత సమయం నడవాలి?
అందరికీ ఒకే విధమైన నడక సమయం సరిపోతుందని చెప్పలేము. ఒకవేళ మీరు శారీరకంగా అంత చురుగ్గా ఉండకపోతే, మొదట 10 నుంచి 15 నిమిషాలతో ప్రారంభించి, ఆపై నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు. చాలా మంది పెద్దలకు వారంలో ఎక్కువ రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అనేది ఒక సులభమైన లక్ష్యం. ఇక్కడ చాలా వేగంగా లేదా ఎక్కువ సమయం నడవాలని మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురిచేసుకోవడం కంటే.. నిలకడగా, క్రమం తప్పకుండా నడవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు.
ఫిట్నెస్ ప్యాకేజీ ఎంచుకోండి







కామెంట్లు (0)