Magazines

గొర్రె పిల్లను కాపాడబోయి
 లారీ ఢీకొని కాపరి మృతి

2 గంటల క్రితం

Shepherd dies after being hit by a lorry while trying to save a lamb.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- మక్తల్ ​
గొర్రె పిల్లను కాపాడే ప్రయత్నం లో లారీ ఢీకొనడంతో ఓ గొర్రెల కాపరి మృతి చెందిన విషాద ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచువార్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఉట్కూరు మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా, మందలోని ఓ గొర్రె పిల్ల రహదారిపై వెళ్తున్న లారీ కిందకు వెళ్లడాన్ని గమనించాడు. దాన్ని కాపాడేందుకు నాగరాజు ప్రయత్నించగా, అదే సమయంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో ఎడవెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్