హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త సినిమా ‘కాసు’. ఈ చిత్రంలో ఇందుకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎ.కె.ఆర్. డ్రీమ్ పిక్చర్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. పి.ఎస్. హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రొడ్యూసర్ నరేంద్ర కొండ మాట్లాడుతూ,‘ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమలో ఉన్న ఒక జంట మధ్య డబ్బు విషయంలో దురాశ అనేది మొదలైతే ఆ బంధానికి, వారి ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ హర్షవర్థన్ తెరకెక్కించారు. ఆశ, దురాశ, ప్రేమ, డబ్బు పట్ల వ్యామోహం..ఇలాంటి హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కలిస్తే చివరకు కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఈ చిత్ర నేపథ్యం. నందు, ఇందుకుమార్ చాలా బాగా నటించారు. ప్రశాంత్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ’ అని అన్నారు. ‘హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. ఈ మూవీ వరల్డ్ లోకి మీరంతా వస్తారని నమ్ముతున్నాం’ అని డైరెక్టర్ పి.ఎస్.హర్షవర్థన్ చెప్పారు. నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది అనుకోకుండా బాగా వచ్చేదాకా చేయండి’ అని తెలిపారు. హీరోయిన్, ప్రొడ్యూసర్ ఇందుకుమార్ మాట్లాడుతూ, ‘మా కాసు మూవీ ఎలా ఉంటుంది?, మీ కాసులకు ఎంత న్యాయం చేస్తుంది అనేది ముందు ముందు తెలుసుకుంటారు’ అని అన్నారు. ‘దండోర, సైక్ సిద్ధార్థ్ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. నా కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ సినిమా ఇది’ అని హీరో శ్రీ నందు చెప్పారు.
డబ్బు కోసం ప్రేమికులు దురాశ పడితే?
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)