దినకరుని పాదసవ్వడి విని
చీకటి దుప్పటిలోంచి
తెలతెల్లగా తొంగిచూసే నింగి
తొలిరూప సౌందర్యంతో వెలిగిపోతూ
నిద్రకళ్ళతో ఉదయపు గాలుల
ప్రాణవాయువు తోడుకుని స్నానమాడి
మెత్తని మబ్బుచీర సింగారించి
లేలేత సూర్యుడ్ని నుదుట దిద్దుకొని
ఉషోదయ ముగ్ధత్వంతో నిలుచుంది
సూర్యుడొచ్చాడా వెలుగుల పొట్లాం తెచ్చాడా
అని ఎదురు చూసిన జీవకోటి
అంబరం భృకుటిన సంబరంగా వెలిగే
బింబాన్ని చూసేక కళకళ్ళాడసాగింది..
వికసించిన పూలు పరిమళంతో నవ్వుతుంటే
చెట్టూచేమ ఎండ పూసుకొని ముస్తాబై
కూర్చున్నాయ్
చీమాపాము సృష్టి కొమ్మకు మరో రోజు
పూసిందని సంబరపడసాగేయ్
రాత్రి సేదతీర్పు అయిపోయి పక్షులు
గూళ్లలోంచి ఆహారాన్వేషణకు
ఆకాశవీధిలోకి పయనమయ్యేయ్..!
భీమవరపు పురుషోత్తమ్, 9949800253
మళ్ళీ మొదలు…
08 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)