Magazines

వీచే గాలులకు

08 సెప్టెంబర్, 2026

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026 | 1 నిమిషాల చదవడం

భిన్నంగా వీచే గాలులు
ఏ ప్రమాణాలు పాటించవు
పునాదులు కదలిస్తాయి!
అరవ వంగదేశాలను
ఒక ఊపు ఊపి
అతలాకుతలం చేసిన గాలులకు
ఏకసూత్రత ఏమీ ఉండదు!
గెలవడానికి
కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు
ఒక్కోసారి ఓటమికి
చెప్పుకోదగ్గ కారణాలేమీ ఉండవు!
మూక సంస్కృతికి
హేతువు బద్ధ శత్రువు
భ్రమలు బద్దలైనప్పుడు
ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు
నలువైపుల గందరగోళం!
‘ మార్పు’ ఎవరికోసమో
ఊహ కందకపోతే
బంగారు కలలన్నీ
పగటి కలలై తేలిపోతాయి!!

కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్