నూతన కుబేరులు పుడుతున్నారు
ఆర్ధిక రంగస్థలాన కొత్తగా
రంగుమార్చిన రంగాల్లో
నోటు నాట్యం చేస్తోంది
చేరేచోటికే చేరుతోంది
నిచ్చెనెమెట్ల వ్యవస్థలో
పైనున్నవారే తమతమ
స్థానాలు మార్చుకుంటున్నారు
మ్యూసికల్ చైర్స్ ఆడుకుంటారు
నువ్వా నేనా అనుకుంటూనే
నువ్వూ నేను మాత్రమేనని
పంచుకుంటున్నారు పరమానాన్ని
అమృతం ఎప్పుడూ వాళ్లకే మరి
గరళం మింగేటోళ్లు కిందే
దరిద్రదేవత ఒళ్లో
ఎప్పుడూ పొదివిపట్టుకొని
వారిని లాలిస్తూ ఉంటుంది
ఆకలిబాధ అలవాటైనోళ్లు కదా
కడుపు నిండితే చాలనుకునే
ను
దుటి రేఖని చెరుపుకోలేక
పాలకుల పక్షపాతానికి గురవుతూ
జన్మచాలిస్తూ ఉంటారు
గణాంక సూచీలు మాత్రం
దీనజనోద్ధరణ మంత్రాన్ని
జపిస్తూ తపిస్తూ తరిస్తూ
కుబేరుణ్ణి సదా మోస్తుంటారు
(కొత్త కుబేరుల జాబితా నేపథ్యంలో)
- జంధ్యాల రఘుబాబు,
9849753298
కుబేరులు
4 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)