దాదాపు 17 మంది మృతి..
12 మందికి గాయాలు
ఇస్తాంబుల్ : పశ్చిమ టర్కీలోని ఓడరేవు నగరం ఇజ్మీర్ సమీపంలో ఉన్న ఓ ఇనుము, ఉక్కు కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారందరూ దేశంలోని ప్రముఖ ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటైన అలియాగాలోని హబాస్ డెమిర్ సెలిక్ ప్లాంట్‌లోని కార్మికులని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గవర్నర్ మాట్లాడుతూ ఒక కొత్త బాయిలర్‌ను మోసుకెళ్తున్న క్రేన్ కూలిపోవడంతో, దాని సామగ్రి కింద ఉన్న కొలిమిలోకి పడి ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. టర్కీలో కార్యాలయ ప్రమాదాలు దీర్ఘకాలిక సమస్యగా కొనసాగుతున్నాయని, ఒక స్వతంత్ర పౌర సమాజ సంస్థ అయిన టర్కిష్ హెల్త్ అండ్ సేఫ్టీ లేబర్ వాచ్ పేర్కొంది. శిథిలాల కింద మరి కొందరు ఉన్నట్టు భావిస్తున్నామని ఇజ్మీర్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ మీడియాకు తెలిపారు.







కామెంట్లు (0)