Magazines

రేపు నేపాల్ ప్రధాని రాక

3 గంటల క్రితం

Minister
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

ఖాట్మండు : నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారని నేపాల్ విదేశాంగ శాఖ శుక్రవారం తెలియజేసింది. మార్చి 27న నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షా తొలిసారి అధికారిక ద్వైపాక్షిక విదేశీ పర్యటన జరుపుతున్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెప్టెంబరులో అమెరికా వెళ్లారు. కాగా షా వెంట 34 మంది సభ్యుల ప్రతినిధి బృందం కూడా భారత్ వెళుతోంది. ఈ బృందంలో ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ సభ్యులుగా ఉంటారని విదేశాంగ కార్యదర్శి అమ త్ బహదూర్ రాయ్ విలేకరులకు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్