యుద్ధం ముగింపునకు దౌత్య ప్రయత్నాలకు బ్రేక్ ...
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కొత్త బాధ్యతలు
వాషింగ్టన్ : ఇరాన్‌తో దౌత్య చర్చలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపుగా తెరదించారు. ఇక ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇప్పటి వరకు ఇరాన్‌తో చర్చల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఆ బాధ్యతల నుంచి తప్పించి, డెమోక్రాట్ల పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి, నేరాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశిం చారు. ఈ పరిణామం ఇరాన్ యుద్ధా న్ని దౌత్యపరంగా ముగిం చాలన్న ప్రయత్నాలపై అనిశ్చితిని పెంచింది. ట్రంప్ గురువారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. ఇరాన్‌తో ఒప్పందం అవసరం లేదని, ఆ రోజులు ఎప్పుడో ముగిశాయని పేర్కొన్నారు. అమెరికా వద్ద ఇరాన్‌కు సంబంధించిన వందల బిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయనీ, హార్ముజ్ జలసంధి కూడా తమ నియంత్రణలో ఉందని వ్యాఖ్యా నించారు. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం పనిచేస్తున్నాయని ఆయన ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
యుద్ధ ప్రభావంపై వాన్స్ వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ ఫిబ్రవరిలో ప్రారంభించిన యుద్ధంపై మొదటి నుంచీ వాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పేలవ ప్రదర్శనకు యుద్ధం వల్ల పెరిగిన ఆర్థిక భారం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించాలని గతంలో తాను ఇచ్చిన సలహా సరైనదేనని సమర్థించుకున్నారు. అయితే ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అడ్డుకోవడానికే సైనిక చర్య అవసరమైందని ట్రంప్ వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ వంటి డెమోక్రాట్ల పాలిత రాష్ట్రాల్లో భారీ అవినీతి, నేరాలు జరుగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు.
ప్రతి నెలా బిలియన్ల డాలర్ల ప్రజాధనం దోపిడీకి గురవుతోందని, ఆ మొత్తాన్ని తిరిగి రాబడితే అమెరికా బడ్జెట్ లోటును పూడ్చవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలనూ వెల్లడించలేదు.
దౌత్యానికి బదులు దిగ్బంధనం
ఇరాన్‌తో చర్చలకు వాన్స్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగను న్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిన మరుసటి రోజే ట్రంప్ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లో ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలకు వాన్స్ నేతృత్వం వహించారు. ఆ చర్చల ఫలితంగా జూన్‌లో కాల్పుల విరమణకు సంబంధించిన అవ గాహన కుదిరినా, కొన్ని వారాల్లోనే అది విఫలమైంది. తాజాగా మరోసారి చర్చలు పునరుద్ధరించేందుకు వాన్స్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా సైన్యం ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం అమలు చేస్తోంది. అంతర్జాతీయ నౌకాయానా నికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణా భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు, తమ హెచ్చరికలను పట్టించుకోని నాలుగు చమురు నౌకల్లో పేలుళ్లు సంభవిం చాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
అంతర్గత రాజకీయాలవైపు మళ్లిన దృష్టి
20287488+ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశమున్న నేతగా భావి స్తున్న వాన్స్‌కు ట్రంప్ ఈ కొత్త బాధ్యతలు అప్పగిం చడం అమెరికా రాజకీయా ల్లోనూ ప్రాధాన్యం సంతరిం చుకుంది. అంతర్జాతీయ యుద్ధం, దౌత్య చర్చల కంటే దేశీయ రాజకీయ ఆరోపణలపై దృష్టి మళ్లించడం ట్రంప్ వ్యూహంలో మార్పును సూచిస్తోంది. అయితే ఇరాన్‌తో చర్చలకు స్వస్తి పలకడం పశ్చిమాసియాలో శాంతి ప్రయ త్నాల భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మార్చింది.






కామెంట్‌లు (0)