Magazines

కిసాన్ సభ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్

9 గంటల క్రితం

viju krishnan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

విజూ కృష్ణన్ : కిసాన్ సభ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, రైతులను హక్కుల పోరాటంలో ఏకం చేసిన నాయకత్వ పటిమతో విజూ కృష్ణన్ మరోసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈయన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడే.

1995లో జేఎన్‌యూ (JNU)లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ప్రజా రంగంలోకి ప్రవేశించారు. 2004లో ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన అనంతరం, బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో అధ్యాపక వృత్తిని విడిచిపెట్టి, భారతీయ రైతుల సమస్యలను భుజానికెత్తుకుని ప్రజా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు.

2009 నుండి కిసాన్ సభ పూర్తికాలపు కార్యకర్తగా వివిధ రాష్ట్రాల రైతులను సంఘటితం చేస్తూ ఉద్యమాలలో ముందుండి నడిపించారు. 2018లో మహారాష్ట్రలో జరిగిన చారిత్రాత్మక 'కిసాన్ లాంగ్ మార్చ్' నుండి ఢిల్లీ రైతు పోరాటం వరకు అనేక ఉద్యమాలకు ప్రధాన నాయకత్వం వహించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అనుబంధ సంస్థ అయిన 'ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఇన్ అగ్రికల్చర్' సెక్రటేరియట్ సభ్యుడిగా కూడా ఉన్నారు.

కేరళలోని కన్నూర్ జిల్లా కరివెళ్లూరుకు చెందిన డాక్టర్ పి. కృష్ణన్, వైక్కం శ్యామల దంపతుల కుమారుడు విజూ కృష్ణన్. పరిశోధకురాలు సమత ఈయన భార్య. వీరికి రియా అనే కుమార్తె ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్