డ్రోన్‌లతో దాడి... ఎగిసి పడిన మంటలు .. 20 మంది మృ
తి
నౌకలోని 23 మంది భారతీయులను కాపాడిన సిబ్బంది
మాస్కో : దక్షిణ రష్యా సముద్ర తీరంలోని ఓ చమురు నౌకపై ఉక్రె యిన్ డ్రోన్‌లతో విరుచుకు పడింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. 20 మంది మృతి చెందారు. లైబీరియా జెండా ఉన్న ఒక ట్యాంకర్‌పై మంగళ వారం సాయంత్రం ‘‘నౌకాదళ డ్రోన్‌లు’ దాడి చేశాయని, దీంతో నల్ల సముద్రంలోని జలాల్లో చమురు మండిపోతోందని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మంటల తీవ్రత అధికంగా ఉందని, దీంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయలేకపోయారని వెల్లడిం చింది. ఆ సమయంలో నౌకలోని 23మంది సిబ్బందిని రక్షించారని, వీరంతా భారతీయులేనని పేర్కొంది. ఈ డ్రోన్ దాడితో సుమారు 5 లక్షల జనాభా ఉన్న ప్రముఖ నగరమైన సోచిని మంటలు, దట్టమైన పొగ చుట్టు ముడుతున్న దృశ్యాలు సోషల్ మీడి యాలో వైరల్‌గా మారాయి. తీరప్రాం తానికి, బీచ్‌ల్లోకి ప్రవేశాన్ని నియం త్రించినట్టు నగర మేయర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ పట్ట ణాలు, నగరాలపై దాడులకు ప్రతి కారంగానే రష్యా చమురు మౌలిక సదుపాయాలపై తాము దాడులు చేస్తున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది.







కామెంట్‌లు (0)