న్యాయస్థానంలో అమెరికా మీడియా సంస్థల తాజా పిటిషన్
వాషింగ్టన్ : తమపై అమెరికా ప్రభుత్వ వివక్షాపూరిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయని మీడియా సంస్థలైన సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో ఆరోపిం చాయి. గతంలో తాము న్యాయ స్థానంలో వేసిన వ్యాజ్యానికి ఈ ఆరోపణను తాజాగా జోడించి సవరణ పిటిషన్‌ను దాఖలు చేశాయి. అధ్యక్షుడి పర్యటనలు, పత్రికా కార్యక్రమాల నుంచి మినహాయించడం ద్వారా తమపై ప్రభుత్వం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డాయి. తమ పాత్రికేయులకు అధ్యక్ష భవనం గుర్తింపు పత్రాలను పునరుద్ధరించినంత మాత్రాన వివక్ష ఆగిపోలేదని ఎత్తిచూపాయి. అధ్యక్ష భవనం ఆవరణలోకి అనుమతిం చినప్పటికీ ఓవల్ కార్యాలయం, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం వంటి పరిమిత ప్రాంతాల్లో కార్య క్రమాలను కవరేజ్ చేసే ప్రెస్ పూల్ నుంచి తమను మినహాయించారని తెలియజేశాయి. తమ వార్తా కవరేజీ నచ్చకపోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం తమపై ఇలాంటి పక్ష పాత, ప్రతీకార చర్యలకు పాల్ప డుతోందని ఆ సంస్థలు తాజా పిటి షన్‌లో వివరించాయి. ఒకసారి పాత్రికేయులను అనుమతించిన తర్వాత ప్రభుత్వానికి నచ్చని విధంగా రిపోర్టింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో కొన్ని నిర్దిష్ట సంస్థలను మాత్రమే మినహాయించే హక్కు అధ్యక్షభవనం అధికారులకు లేదని వాదించాయి. భవిష్యత్తులో తమపై ఎలాంటి ప్రతీకార ఆంక్షలు విధించకుండా శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేయాలని ఆ సంస్థలు వాషింగ్టన్ ఫెడరల్ జడ్జి తిమోతి కెల్లీని అభ్యర్థించాయి.







కామెంట్‌లు (0)