తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పరిపాలన వ్యవహారాల్లో కీలక మలుపు. ఈనెల 21నతో పదవీ కాలం ముగిసిన అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక బాధ్యతల నిర్వహణ కోసం కొనసాగేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ‘సింగిల్ మెంబర్ కమిటీ పర్యవేక్షణలో గత ఎన్నికైన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు నిర్దేశించిన ఆదేశాల ప్రకారం తాత్కాలిక విధులు నిర్వర్తించవచ్చు. హెచ్సీఏ సభ్యుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసి, ఎన్నికలు నిర్వహించేంత వరకు అపెక్స్ కౌన్సిల్ కొనసాగవచ్చని న్యాయస్థానం సూచించింది. కొత్త కార్యవర్గం ఎన్నుకునేందుకు ఎస్జీఎం, ఏజీఎం ఏర్పాటు చేయాలని 108 మంది హెచ్సీఏ సభ్యులు ఇటీవల సింగిల్ మెంబర్ కమిటీ చైర్మెన్ జస్టిస్ నవీన్ రావుకు లేఖ అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది!.







కామెంట్లు (0)