ఐరాసలో వాగ్యుద్ధం నేపథ్యంలో నిర్ణయం
న్యూయార్క్ : అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబా దౌత్యవేత్తను వాషింగ్టన్ నుంచి బహిష్కరించింది. క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల గురించి ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఆ తర్వాత క్యూబా రాయబారిని అమెరికా నుంచి బహిష్కరించినట్లు వాల్ట్ తెలిపారు. 'వారి ప్రతినిధి బృం దంలోని క్యూబా దౌత్యవేత్తను బహిష్కరించే పత్రాలపై మా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సంతకం చేశారు' అని ఆయన చెప్పారు. 'ఆయన వెళ్లిపోయారు.
రాబోయే 24 గంటల్లో ఆయన హవానాకు విమానంలో బయలుదేరతారు' అని అన్నారు. క్యూబా దౌత్యవేత్త తమ బృందంలో ఒకరిని తోసి, దాడి చేయడానికి ప్రయత్నిం చారని ఆరోపించారు. ఇక్కడ ఓ అమెరికన్‌పై చేయి వేస్తే అధ్యక్షుడు ట్రంప్, రుబియో, తాను దానిని సహించబోమని తెలిపారు. ఆ దౌత్యవేత్తను అమెరికాలోకి అనుమతించబోమని క్యూబాకు తెలియజేశామని, దాంతో ఆయన వెళ్లిపోయారని చెప్పారు. ఈ ఘటనపై ఐరాసలోని క్యూబా మిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్యూబా దౌత్యవేత్త ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగత గోప్యతలోకి చొరబడి వీడియోలో ఆ ఘటనను చిత్రీకరించి దానిని సామాజిక మాధ్యమాలలో పెట్టారంటూ అమెరికా దౌత్యవేత్తపై ఐరాస సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేసింది.
అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం
అనుకూలంగా ఓటేసిన భారత్ క్యూబాపై అమెరికా అమలు చేస్తున్న దీర్ఘకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఖండిస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదిం చింది. తీర్మానానికి అనుకూలంగా 130 ఓట్లు రాగా కేవలం 17 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఇరవై ఐదు మంది ఓటింగుకు దూరంగా ఉన్నారు. తీర్మానాన్ని భారత్ కూడా సమర్ధించింది. గత సంవ త్సరం ఇదే విధమైన తీర్మానాన్ని 165 దేశాలు సమర్ధించాయి. ఏడు దేశాలు వ్యతిరేకించగా 12 దేశాలు గైర్హాజరు అయ్యాయి. గతంలో తీర్మానానికి అను కూలంగా ఓటేసిన జర్మనీ, ఇటలీ ఇప్పుడు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. కాగా ఓటింగ్ అనంతరం క్యూబా విదేశాంగ మంత్రి రోడ్రిగ్జ్ మాట్లాడుతూ ఆంక్షల ద్వారా క్యూబాను ఆర్థికంగా మరింత ఒంటరిని చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.







కామెంట్లు (0)