Magazines

ఇరాన్‌ సముద్ర తీరంలో ఐఫోన్లు

3 గంటల క్రితం

Iranian coast
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

ఎగబడిన జనాలు
టెహ్రాన్: హార్ముజ్‌ జలసంధిలో తీరానికి వేలాది ఐఫోన్లు , లగ్జరీ పర్‌ఫ్యూమ్‌ లు కొట్టుకువచ్చాయి. దీంతో వాటి కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. దొరికినన్ని ఐఫోన్లు, పర్‌ఫ్యూమ్‌లు తీసుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు జాలర్లు చిన్న పడవల్లో వెళ్లి.. ఐఫోన్లు ఉన్న షిప్పింగ్‌ కంటైనర్‌ను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. శనివారం వీటిల్లో కొన్ని ఇరాన్‌ తీరానికి కొట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏ ప్రాంతానికి కొట్టుకువచ్చాయనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఘటన నిజంగానే జరిగినప్పటికీ కొందరు వ్యక్తులు ఘటనకు సంబంధించిన ఏఐ వీడియోలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా ఫ్యాక్ట్-చెక్‌ కథనాలు వెల్లడించాయి. ఏం జరిగిందంటే..? రెండు రోజుల క్రితం హార్ముజ్‌ జలసంధిలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్ జీసీ) వెల్లడించింది. ప్రమాదానికి గురైన జీఎఫ్‌ఎస్‌ ప్రైడ్ అనే సింగపూర్‌ జెండా ఉన్న నౌక దుబాయ్ నుంచి దాదాపు 2500 కంటైనర్లతో వెళ్తున్నట్టు సమాచారం. వీటిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్‌ బాటిళ్లు, తదితర వస్తువులున్నాయి. ప్రమాదం అనంతరం కంటైనర్లు చెల్లాచెదురు కాగా.. అందులోని ఐఫోన్‌లు సహా ఇతర వస్తువులు కుప్పలుగా నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం అవే సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్