ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్2
నవతెలంగాణ-హైదరాబాద్ :
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో తెలంగాణ జట్టు కాకతీయ నైట్స్ మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెరో ఆర్చర్ చేతిలో 0-6తో కాకతీయ నైట్స్ పరాజయం పాలైంది. లీగ్‌లో 4 మ్యాచ్‌ల్లో కాకతీయ నైట్స్‌కు ఇది రెండో ఓటమి కాగా, చెరో ఆర్చర్స్‌కు 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం. అటాను దాస్, క్యాసీలు వరుసగా 10 పాయింట్ల షాట్లతో మెరువగా చెరో ఆర్చర్స్ అన్ని సెట్లలోనూ కాకతీయ నైట్స్‌పై ఆధిపత్యం చెలాయించింది. 6-0తో ఏకపక్ష విజయం ఖాతాలో వేసుకుంది.





కామెంట్‌లు (0)