పంజాబ్ జీసీ స్టార్ గోల్ఫర్ కరణ్‌దీప్ కొచ్చర్
నవతెలంగాణ-హైదరాబాద్ :
గోల్ఫ్ అనగానే ధనవంతులు ఆడే ఆట అనే ముద్ర ఉంది. అందుకు తగినట్టుగానే గోల్ఫ్ క్లబ్‌ల నిర్వహణ ఉండేది. కానీ, ఇటీవల కాలంలో గోల్ఫ్ సామాన్యులకు సైతం సలాం చేస్తోంది. ఇతర క్రీడల మాదిరిగానే గోల్ఫ్‌ను సామాన్యులు కెరీర్‌గా ఎంచుకుని, రాణించవచ్చని నిరూపించింది యువ గోల్ఫర్ ప్రణవి. ఆసియా క్రీడల్లో చారిత్రక పసిడి పతకం సాధించిన ప్రణవి.. భారత్‌లో గోల్ప్‌కు సరికొత్త జోష్ తీసుకొచ్చిందని ఆమె కాబోయే భర్త, స్టార్ గోల్ఫర్ కరణ్‌దీప్ కొచ్చర్ అన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదికగా నిర్వహించిన కృష్ణ ఇన్విటేషనల్ ఏఎం గ్రీన్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) టోర్నమెంట్‌లో పోటీపడిన కరణ్‌దీప్ కొచ్చర్ రెండో స్థానంలో నిలిచారు. పంజాబ్ రాఫ్టర్స్ గోల్ఫ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కరణ్‌దీప్ కొచ్చర్ ‘నవ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రణవి విజయం చారిత్రకం
ఆసియా క్రీడల వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో దేశం గర్వపడే ప్రదర్శన చేసే అవకాశం జీవితకాలంలో ఒకసారే వస్తుంది. ఆఖరు రోజు వరల్డ్ నం.6 గోల్ఫర్‌తో పోటీపడుతూ ప్రణవి పుంజుకున్న తీరు అద్వితీయం. ఆసియా క్రీడల్లో ప్రణవి పసిడి విజయం చారిత్రకం. ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్)తో పాటు యావత్ భారత్ ప్రణవి పసిడి విజయం పట్ల గర్వపడుతోంది. ప్రణవి అద్భుత ఆటతీరుతో టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. ప్రణవి విజయాన్ని చూసి చిన్నారులు గోల్ఫ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారు. భారత గోల్ఫ్‌కు ఇది గొప్ప శుభసూచకం.
ఇక్కడ ఆడటం సవాల్
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో ఆడటం ఓ సవాల్. హెచ్‌జీసీలో పచ్చిక, బలమైన గాలులు షాట్ సెలక్షన్, పేస్, టెక్నిక్‌లో మార్పులు చేసుకునేలా చేస్తాయి. కృష్ణ ఇన్విటేషనల్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్‌లో తొలి రెండు రౌండ్లలో రాణించినా, మూడో రౌండ్లో కాస్త తడబాటుకు గురయ్యాను. అయినా, రెండో స్థానంలో నిలువటం సంతోషంగా ఉంది. పంజాబ్ రాఫ్టర్స్ జీసీ జట్టు బాగుంది. టీమ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతున్నాం.






కామెంట్‌లు (0)