ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్ కుమార్
జమ్మూ కశ్మీర్‌పై రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుపు
శ్రీనగర్ : ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతమైంది. రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌పై రెస్ట్ ఆఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 279 పరుగుల ఛేదనలో జమ్మూ కశ్మీర్ చతికిల పడింది. రెస్ట్ ఆఫ్ ఇండియా పేసర్ ముకేశ్ కుమార్ (6/33) ఆరు వికెట్లతో విజృంభించగా, మరో పేసర్ ఆకాశ్ దీప్ (3/25) మూడు వికెట్లతో మెరిశాడు. 28.4 ఓవర్లలో 111 పరుగులకే జమ్మూ కశ్మీర్ కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్లు శుభమ్ ఖజురియ (36), కమ్రాన్ ఇక్బాల్ (32), అబ్దుల్ సమద్ (20) మినహా అందరూ దారుణంగా విఫలం అయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగా.. జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసి విలువైన తొలి ఆధిక్యం దక్కించుకుంది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా 319 పరుగులతో పుంజుకుంది. ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ పేస్ పదును ముందు జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతం కాగా.. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఈ నెల 11 నుంచి ఆరంభం కానుంది.






కామెంట్‌లు (0)