Magazines

బ్లాక్ హాక్స్ పతక మెరుపుల్

2 గంటల క్రితం

medal
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

కావా మెన్స్ వాలీబాల్ లీగ్

భువనేశ్వర్ (ఒడిశా) : సెంట్రల్ ఆసియా వాలీబాల్ అసోసియేషన్ (సీఏవీఏ) ప్రతిష్టాత్మక మెన్స్ వాలీబాల్ లీగ్ లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఫ్రాంచైజీ జట్టు తెలుగు బ్లాక్ హాక్స్ కాంస్య పతకం సాధించింది. ఆసియాలోని మేటి క్లబ్ జట్లు తలపడే ఈ టోర్నీలో తెలుగు బ్లాక్ హాక్స్ మెడల్ సాధించి సత్తా చాటింది. ఆదివారం భుబనేశ్వర్ లోని కళింగ యూనివర్సిటీలో జరిగిన కాంస్య పతక పోరులో కజకిస్తాన్ క్లబ్ జట్టు జెటిసు పై 3-1 తో బ్లాక్ హాక్స్ విజయం సాధించింది. 25-23, 21-25, 25-17, 25-22 తో బ్లాక్ హాక్స్ గెలుపొందింది. బ్లాక్ హాక్స్ ఆటగాడు హెక్టర్ అలెక్సిస్ క్రూజ్ 29 పాయింట్లతో అదర గొట్టాడు. కావా వాలీబాల్ లీగ్ లో మెడల్ సాధించిన బ్లాక్ హాక్స్ ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని ఆ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్