క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్ : 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో ప్రముఖ క్రీడాకారుల భాగస్వామ్యం అవసరమని రాష్ర్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. యూత్ గేమ్స్ జరుగనున్న క్రీడా వేదికలను ప్రముఖ క్రీడాకారులు దత్తత తీసుకుని పోటీల నిర్వహణ పర్యవేక్షించే ఆలోచన ఉందని ఆయన అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై క్రీడా ప్రముఖులు అంబటి రాయుడు, గుత్తా జ్వాల, నిఖత్ జరీన్, ఇషా సింగ్, నందిని తదితరులతో క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో కలిసి మంత్రి మంగళవారం రాష్ర్ట సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు.







కామెంట్‌లు (0)