Magazines

విజయం సాధించాలని..!

1 గంట క్రితం

achieve success
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

జోరుమీద కనిపిస్తున్న హైదరాబాద్‌
నేటి నుంచి చత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్‌ రంజీ పోరు


నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ మరో సమరానికి సై అంటోంది. ఎలైట్‌ గ్రూప్‌-బిలో మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాల్గో రౌండ్‌ మ్యాచ్‌లు నేటి నుంచి ఆరంభం కానుండగా సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌లో చత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. గత మ్యాచ్‌లో ఎర్ర, నల్ల మట్టి మిశ్రమ పిచ్‌ నుంచి స్పిన్నర్లకు టర్న్‌ లభించలేదు. దీంతో త్రిపుర మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ను నేడు వాడనున్నారు!. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై స్పిన్నర్లు తనయ్‌‌ త్యాగరాజన్‌, అనికెత్‌ రెడ్డి, రుతిక్‌ యాదవ్‌లను హైదరాబాద్‌ తుది జట్టులోకి తీసుకోనుంది. కెప్టెన్‌ సీవీ మిలింద్‌, రక్షణ్‌ రెడ్డి పేస్‌ బాధ్యతలు చూసుకోన్నారు. బ్యాటింగ్‌ లైనప్‌లో అభిరథ్‌ రెడ్డి, కొడిమెల హిమతేజ, ప్రజ్ఞయ్‌ రెడ్డి, రాహుల్‌ రాదేశ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో విజయమే లక్ష్యంగా హైదరాబాద్‌ బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌, చత్తీస్‌గఢ్‌ రంజీ మ్యాచ్‌ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్