Magazines

డిసెంబర్ 9 నుంచి చెన్నైలో 10వ 'యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన 2026’

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సోలాపూర్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్జిఎంఏ) ఆధ్వర్యంలో 10వ ‘యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన 2026’ రాబోయే డిసెంబర్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు చెన్నైలోని నందంబక్కమ్‌లో గల చెన్నై ట్రేడ్ సెంటర్ (హాల్ నెం. 4) లో వైభవంగా జరగనుంది. తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా యూనిఫామ్స్ మరియు టవల్స్ రంగాలు కలిసి ఒకే చోట ఈ తరహా భారీ ప్రదర్శనను ఏర్పాటు చేస్తుండటం విశేషం.


యూనిఫామ్, టవల్ పరిశ్రమలకు సంబంధించి అత్యంత ప్రత్యేకమైన సోర్సింగ్ మరియు నెట్‌వర్కింగ్ వేదికగా నిలవనున్న ఈ మూడ్రోజుల బి2బి ఎగ్జిబిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. ఇందులో 25,000 కంటే ఎక్కువ యూనిఫామ్స్, దుస్తుల మెటీరియల్స్, అనుబంధ ఉత్పత్తులతో పాటు 300కు పైగా టవల్, చాదర్ డిజైన్లను ప్రదర్శించనున్నారు.


గ్లోబల్ యూనిఫామ్ మార్కెట్ విలువ 2023 నాటికి సుమారు 65 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని, విద్యా సంస్థలు, వైద్య రంగం, హాస్పిటాలిటీ, తయారీ మరియు కార్పొరేట్ రంగాల నుంచి లభిస్తున్న భారీ డిమాండ్ కారణంగా 2030 నాటికి ఇది వార్షికంగా 4 శాతం వృద్ధి రేటును (సిఏజిర్) సాధించనుందని ఎస్‌జిఎమ్‌ఎ తెలియజేసింది.


తయారీదారులతో నేరుగా వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త ఉత్పత్తులను పరిశీలించడానికి డిస్ట్రిబ్యూటర్లు,డీలర్లు, రీటైలర్లు, పాఠశాలలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ కొనుగోలుదారులు మరియు నూతన పారిశ్రామికవేత్తలకు ఈ ప్రదర్శన అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో పాఠశాల యూనిఫామ్‌లు, స్పోర్ట్స్ వేర్, కాలేజీ డ్రెస్సులు, పారిశ్రామిక మరియు కార్పొరేట్ దుస్తులు, ఆసుపత్రి సిబ్బంది దుస్తులు, వింటర్ వేర్, బ్లేజర్లు, యూనిఫామ్ ఫ్యాబ్రిక్స్, స్కూల్ బెల్టులు, టైలు, లోగోలు,ప్రింటింగ్ పరికరాలు, స్కూల్ షూలు, సాక్స్, స్కూల్ మరియు కాలేజీ బ్యాగులతో పాటు బాత్ టవళ్లు, చాదర్లు, నాప్కిన్లు మరియు హోటల్ టవళ్లను ప్రదర్శించనున్నారు.


ఈ ఏడాది ‘వైబ్రెంట్ టవల్’ చొరవలో భాగంగా టవల్ తయారీదారులు కూడా ఈ ప్రదర్శనలో భాగస్వాములు కానున్నారు. భారతీయ వ్యాపార చరిత్రలోనే తొలిసారిగా యూనిఫామ్స్ మరియు టవల్స్ తయారీదారులు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఒకే చోట పాఠశాలలు, పారిశ్రామిక, కార్పొరేట్, హాస్పిటాలిటీ రంగానికి చెందిన దుస్తులతో పాటు బాత్ టవళ్లు, గిఫ్ట్ సెట్లు, పూల్ టవళ్లు, కిచెన్ టవళ్లు, బీచ్ టవళ్లు, బాత్ రోబ్‌లు మరియు ప్రసిద్ధి చెందిన సోలాపూర్ చాదర్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుండటంతో ఈ ప్రదర్శన రీటైలర్లకు ఎంతగానో ప్రయోజనకరంగా మారనుంది.


ఈ సందర్భంగా ఎస్‌జిఎమ్‌ఎ ప్రదర్శన ఛైర్మన్ శ్రీ అశోక్ చవాన్ మాట్లాడుతూ.. "2017లో మొదటి ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి, యూనిఫామ్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఎస్‌జిఎమ్‌ఎ కృషి చేస్తోంది. ఈ 10వ అంతర్జాతీయ యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన 2026 ద్వారా దుస్తులు, మెటీరియల్స్, అనుబంధ సాధనాలు, పాదరక్షల వరకు ఈ రంగానికి చెందిన సమగ్ర సప్లై చైన్‌ను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాము. నూతన వ్యాపార అవకాశాలను సృష్టించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ యూనిఫామ్,టవల్ తయారీదారులను పోటీదారులకు సరిసాటిగా నిలబెట్టడమే మా ప్రధాన లక్ష్యం" అని తెలిపారు.


యూనిఫామ్ మరియు టవల్ పరిశ్రమకు ఈ వేదిక కొనుగోళ్లు, బిజినెస్ నెట్‌వర్కింగ్ మరియు వ్యాపారాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. కొనుగోలుదారులు కొత్త ఉత్పత్తులను కనుగొనడానికి, వేర్వేరు మోడళ్లు మరియు మెటీరియళ్లను పోల్చి చూసుకోవడానికి, తయారీదారులతో నేరుగా కనెక్ట్ అయ్యి భారీ పరిమాణంలో క్రమానుగత ఆర్డర్లు ఇచ్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది.


ఎస్‌జిఎమ్‌ఎ ప్రదర్శన కార్యదర్శి శ్రీ అనికేత్ మహింద్రాకర్ మాట్లాడుతూ.. "యూనిఫామ్ మరియు టవల్ రంగాలు నేడు డిజైన్లు, ఫ్యాబ్రిక్స్, సాంకేతికత మరియు మార్కెటింగ్ విధానాలలో వేగవంతమైన మార్పులను సాధిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి, ప్రముఖ మరియు వర్ధమాన తయారీదారులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రీటైలర్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్పొరేట్ సంస్థలు మరియు వ్యాపారవేత్తలు ఈ ప్రదర్శనలో పాల్గొని ఇక్కడ అందుబాటులో ఉన్న విస్తృతమైన వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము" అని కోరారు.


భారతీయ యూనిఫామ్స్ మరియు టవల్స్ తయారీ రంగంలో సోలాపూర్ పారిశ్రామిక ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి తయారీదారులు భారీ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను వేగంగా సరఫరా చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.దేశవ్యాప్తంగా తమ వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరించిన సోలాపూర్ పరిశ్రమలు, ఇటు చిన్న తరహా ఆర్డర్లను, అటు క్రమానుగత భారీ ఆర్డర్లను సమర్థవంతంగా నిర్వహించగలవు.


2017లో సోలాపూర్‌లో ప్రారంభమైన ఈ 'యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన' ఆ తర్వాత బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మరియు వారణాసి వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. ఈ ఏళ్ల ప్రయాణంలో ఈ రంగంలో 300 మందికి పైగా కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.


భారతదేశ టెక్స్‌టైల్ మరియు తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు 'మేక్ ఇన్ ఇండియా' ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రదర్శన నిర్వహించబడుతోంది. ఈ వేదిక ద్వారా దేశీయ సప్లై చైన్‌ను బలోపేతం చేయడం, కొత్త వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడం మరియు ప్రపంచ మార్కెట్లలో భారతీయ తయారీదారులకు విస్తృత అవకాశాలను కల్పించడమే ఎస్‌జిఎమ్‌ఎ లక్ష్యం.


దేశం నలుమూలల నుండి తయారీదారుల భాగస్వామ్యం మరియు విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణితో జరగనున్న ఈ 10వ యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన 2026, ఈ రంగానికి చెందిన వ్యాపారాభివృద్ధికి ఒక సమగ్రమైన వేదికను అందించనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్