Magazines

సర్పంచులు, కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్‌

1 గంట క్రితం

Video conference
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్‌, డోంగ్లీ మండలాల పరిధిలోని గ్రామాల సర్పంచులతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసింది. సమావేశం మద్నూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సర్పంచులు, కార్యదర్శులను ఉద్ధేశించి ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో వీబీజీ గ్రామ్‌జీ ద్వారా ప్రత్యేక పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. అతి ముఖ్యంగా నీటిని వృధా చేయొద్దనీ, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో ప్రస్తుతం కరువు దాపురించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. వెంటనే గ్రామాల్లో అధికారులు, పాలకవర్గాలు పాటించాల్సిన కార్యాచరణ దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ అరుణ్, వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్