తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్
నవతెలంగాణ-నూతనకల్
ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేస్తామని తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఇటీవల పంపిణీ చేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించినట్టు చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటికలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.. డబుల్ బెడ్ రూముల పంపిణీ రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకే ఇండ్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ రైతు కోఆర్డినేటర్ బాణాల సుదర్శన్ రెడ్డి, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల నాగమల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు పులుసు సైదులు, బిక్కి శ్రీనాథ్, పంతం వెంకన్న, పులుసు రవి, బత్తుల మల్లయ్య, బత్తుల సురేష్, బత్తుల రవి, బత్తుల వెంకట నరసయ్య, బాణాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు .





కామెంట్లు (0)