Magazines

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపు

1 గంట క్రితం

DA hike
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దీపావళి ముంగిట కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు సహాయం (డీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఉద్యోగులకు అదనపు డీఏ, పెన్షనర్లకు డీఆర్ విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 60 శాతం బేసిక్ పే/పెన్షన్‌పై అదనంగా 3 శాతం పెంపునకు అంగీకరించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.10,016.10 కోట్ల అదనపు భారం పడనుందని కేబినెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా పెంపు 2026 జూలై 1 నుంచే అమల్లోకి వస్తుంది. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో మొత్తం డీఏ 63 శాతానికి చేరుతుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఆమోదించిన ఫార్ములా ప్రకారమే ఈ పెంపు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్