భారత్‌ను కోరిన రుబియో
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారు
జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీని సందర్శించిన
అమెరికా వాణిజ్య మంత్రి
ముంబయి : ఇంధన, రక్షణ రంగాల్లో సహకరించుకునేందుకు భారత్, అమెరికా సంసిద్ధత వ్యక్తం చేశాయి. వాషింగ్టన్ నుంచి ఇంధన కొనుగోళ్లను పెంచుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్‌ను కోరారు. అమెరికా అనుసరిస్తున్న అనూహ్య వాణిజ్య విధానాలు, కఠినతరం అవుతున్న వలస నిబంధనల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలో పర్యటి స్తున్న రుబియో మంగళవారం ముంబయిలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆతిథ్యా న్ని స్వీకరించి ఆయనతో విస్త త చర్చలు జరిపారు. గడచిన ఐదు నెలల వ్యవధిలో మన దేశంలో పర్యటించడం ఇది రెండోసారి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని రుబియో తెలిపారు. అమెరికాలో నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాలను పెంచడానికి, తద్వారా ధరలపై ఒత్తిడిని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా రుబియో తన తొలి రోజు పర్యటనలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. అలాగే జైశంకర్, యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రుబియో మధ్య త్రైపాక్షిక సమావేశం కూడా జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీని సందర్శించడానికి జామ్‌నగర్ వెళ్లడానికి ముందు రుబియో అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ, టాటా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అధికారి (సీఈఓ) ఎన్.చంద్రశేఖరన్‌లతో సమావేశమయ్యారు. అదానీపై మోపిన అభియోగాలను అమెరికా న్యాయ శాఖ ఉపసంహరించుకోవడం, ఆయనపై ఉన్న ఓ క్రిమినల్ కేసును యూఎస్ ఫెడరల్ జడ్జి ఒకరు కొట్టివేయడం వంటి పరిణామాల తర్వాత గౌతమ్‌తో మొదటిసారి రుబియో భేటీ అయ్యారు. రుబియో బుధవారం జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. రాత్రి జామ్‌నగర్‌లోనే బస చేసిన రుబియో గురువారం ఉదయం తిరిగి ముంబయి చేరుకుంటారు.






కామెంట్‌లు (0)