Magazines

పరిధి దాటొద్దు

1 గంట క్రితం

Do not cross the line.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

కేరళం మాజీ సీఎం విజయన్‌‌ ఎఫ్‌ఐఆర్‌‌

దర్యాప్తుపై ఈడీకి సుప్రీం ఆదేశం

ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అని

పోలీసులను ప్రశ్నించిన న్యాయమూర్తి

న్యూఢిల్లీ : సీఎంఆర్‌ఎల్‌-ఎగ్జాలజిక్‌ ‌ముడు పుల కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌‌, ఆయన కుమార్తె టి.వీణా, అల్లుడు, మాజీ మంత్రి పి.ఎ.మహ్మద్‌ ‌రియాజ్‌‌లపై నమోదైన ఎఫ్‌ఐ ఆర్‌‌కు సంబంధించి కేరళం పోలీసుల దర్యాప్తుపై సుప్రీంకోర్టు బుధవారం ఏడు రోజుల పాటు స్టే విధించింది. పరిధి దాటొద్దు అంటూ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ)కి సూచిం చారు. పీఎంఎల్‌ఏ కింద తనకు గల చట్టబద్ధమైన అధికారాలను విస్తరిం చవద్దంటూ ఇడికి న్యాయమూర్తి సూచించారు. హవాలా ఆపరేటర్లు, మాజీ ముఖ్యమంత్రులను పీఎం ఎల్‌ఏ కింద విచారించేందుకు ఈడీకి పూర్తిస్థాయి అధికారాలు వున్నప్పటికీ ఇతర సంస్థల చట్టబద్ధమైన పరిధుల్లోకి చొరబడరాదని పేర్కొ న్నారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌‌కు మేం భంగం కలిగించం, కానీ దర్యాప్తును నిలుపుచేస్తాం. పైగా ఈ కేసును తిరిగి విచారణ నిమిత్తం హైకోర్టుకు పంపుతు న్నాం’’ అని జస్టిస్‌ ‌జోమాల్యా బాగ్చి, జస్టిస్‌ ‌వి.మోహనలతో కూడిన బెంచ్‌ ‌పేర్కొంది. తనను, తన కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుందని 82 ఏండ్ల విజయన్‌ ఆందో ళనల నేపథ్యంలో ఈ పిటిషన్‌‌ను విచారించడానికి దసరా సెలవుల మధ్యలో బెంచ్‌ ‌సమావేశమైంది. ఈ నెల 9న తమపై ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేయాలని ఆదేశించడానికి ముందుగా తమను ప్రతివాదులుగా చేర్చలేదని, అలాగే ఏకసభ్య బెంచ్‌ తమ వాదనలు వినలేదని విజయన్‌, మరో ఇద్దరు సహ పిటి షనర్లు పేర్కొన్నారు. అందువల్లే సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చింద న్నారు.

ఈ నెల 15న కేరళ హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌ ‌జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీం, వారిపై అవినీతి ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయడానికి ముందుగా విజయన్‌, మరో ఇద్దరు పిటిషనర్లు పెట్టుకున్న పిటిషన్లను విచారించా ల్సిందిగా డివిజన్‌ ‌బెంచ్‌‌ను ఆదేశించింది. ఒక వ్యక్తి ఎంత చిన్న స్థాయిలో వున్నా లేదా పెద్ద స్థాయిలో వున్నా ఆ వ్యక్తి చట్టబద్ధ పాలన, సహజ న్యాయ సూత్రా లకు లోబడి వుంటాడని ప్రభుత్వానికి జస్టిస్‌ ‌బాగ్చి గుర్తుచేశారు. పిటిషనర్లపై నమోదైన తదుపరి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌కేస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) ‌చెల్లుబాటుపై బెంచ్‌ ఎలాంటి అభిప్రా యాలను నమోదు చేయలేదు. చట్టానికి అనుగు ణంగా ఈసీఐఆర్‌‌ను సముచిత వేదిక ఎదుట సవాలు చేసుకునే స్వేచ్ఛను కోర్టు వారికి ఇచ్చింది.

హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌విచారించి, నిర్ణయించే వరకూ దర్యాప్తు ఉండదు : జస్టిస్‌ ‌బాగ్చీ

పీఎంఎల్‌ఏ కింద తనకు గల చట్టబద్ధమైన అధికారాలను విస్తరించ వద్దంటూ ఇడికి న్యాయ మూర్తి సూచించారు. హవాలా ఆపరేటర్లు, మాజీ ముఖ్యమంత్రులను పీఎంఎల్‌ఏ కింద విచారిం చేందుకు ఈడీకి పూర్తిస్థాయి అధికారాలు వున్నప్పటికీ ఇతర సంస్థల చట్టబద్ధమైన పరిధుల్లోకి చొరబడ రాదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని విచారించేందుకు 1988 నాటి చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద ప్రభుత్వం నుంచి పోలీసులు ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అని న్యాయమూర్తి ప్రశ్నిం చారు. కోర్టు ఆదేశాల మేరకే ఎఫ్‌ఐఆర్‌‌పై దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని కూడా బెంచ్‌ ‌సరిదిద్దింది. ఈడీ ఇచ్చిన సమాచారం ప్రాతిపది కన జరుగుతున్న దర్యాప్తు ఇదని జస్టిస్‌ ‌బాగ్చి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల అప్పీళ్ళపై విచారణ జరిగేటపుడు బుధవారం కోర్టులో చర్చించిన ఈ అంశాలన్నింటినీ కూడా హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌పరిశీలించాలని సుప్రీం పేర్కొంది. ‘‘మేం ఎఫ్‌ఐఆర్‌‌ను కొనసాగిస్తాం. ఈ అంశాలన్నింటినీ హైకోర్టు విచారించి, నిర్ణయించేవరకు ఎలాంటి దర్యాప్తు వుండదు.’’ అని దాదాపు గంట పాటు సాగిన విచారణలో జస్టిస్‌ ‌బాగ్చి స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్