Magazines

ఆధునిక తరం రైడర్ల కోసం క్లాసిక్ లెజెండ్స్ జావా

3 గంటల క్రితం

Classic Legends Jawa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 5 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: క్లాసిక్ లెజండ్స్ కు, జావా, యెజ్డీ మరియు BSA వంటి మూడు అలాంటి దిగ్గజపు బ్రాండ్స్ లను  భారతదేశంలోని రైడర్లకు తిరిగి తీసుకురావడమే ఈ ప్రయాణం ఉద్దేశ్యం. దీని గాథ ఇది పునరుద్ధరించిన బ్రాండ్స్ ద్వారా మాత్రమే కాకుండా, ఇది ఎదుర్కొన్న సవాళ్లు, ఇది రూపొందించిన సమాజాలు మరియు ఈ వారసత్వాలు ముందుకు కొనసాగడానికి దీని యొక్క దృఢ సంకల్పం  ద్వారా నిర్వచించబడింది.

2018: ఈ ప్రయాణం జావాతో ప్రారంభమైంది

నవంబర్ 15,2028లో, సహ-స్థాపకులు అనుపమ్ థరేజా మరియు బొమన్ రుస్తమ్ ఇరానీల నాయకత్వంలో మహీంద్ర గ్రూప్ కంపెనీ  క్లాసిక్ లెజండ్స్, జావాను మళ్లీ భారతదేశంలోకి తిరిగి తీసుకురావడం ద్వారా తమ పునరుద్ధరణ ప్రయాణాన్ని ప్రారంభించాయి. దిగ్గజపు మోటార్ సైకిల్ బ్రాండ్స్ యొక్క లక్షణం, మూలాలు మరియు స్ఫూర్తిని సంరక్షిస్తూనే వాటిని  సమకాలీన రైడర్స్ కోసం పునః పరిచయం చేయడమే లక్ష్యం.

జావా 350 మరియు జావా ఫార్టీ-టులు విజయవంతమైన చెక్ మూలాల  బ్రాండ్ తిరిగి రావడాన్ని సూచించగా, పెరాక్ ఒక విలక్షణమైన ఫ్యాక్టరీ- కస్టమ్ బాబర్ గా  ప్రారంభించబడింది. ఈ మోటార్ సైకిల్స్ జావా యొక్క శాశ్వతమైన డిజైన్ మరియు క్లాసిక్ లక్షణాన్ని ముందుకు తీసుకువెళ్తూనే, సమకాలీన ఇంజనీరింగ్, పనితీరు మరియు భద్రతను పరిచయం చేసాయి.

ప్రతిస్పందన తక్షణమే లభించడమే కాకుండా అనూహ్యంగా కూడా ఉంది. ఒక్క రోజులోనే జావా 1,00,000 బుక్కింగ్స్ తో రికార్డ్ నమోదు చేయగా, వెబ్ సైట్ లో ఊహించలేనంత పెరుగుదల దాదాపు వెబ్ సైట్  నిలిచిపోవడానికి దారితీసింది. 100 రోజుల్లో 100 డీలర్ షిప్స్ ను స్థాపించడంతో పాటు మరియు ఉత్పత్తి సామర్థ్యం   కూడా పెంచి క్లాసిక్ లెజెండ్స్ ప్రతిస్పందించింది.

ఇది భారతదేశం జావాను ఎన్నడూ మర్చిపోలేదని నిర్థారించింది. ఇది తమ మొదటి ప్రధానమైన సవాలును కూడా క్లాసిక్ లెజెండ్స్ కు అందించింది: దిగ్గజపు పేరు చుట్టూ ఉన్న భావోద్వేగాన్ని సుస్థిరమైన ఉత్పత్తి, రిటైల్ మరియు యాజమాన్యపు వ్యవస్థగా మార్చడం.

 

2020–2021: పరీక్షలు చేయబడినా, ఇంకా ముందుకు  కొనసాగుతోంది

పునరుద్ధరణ పూర్తిగా స్థిరపడటానికి ముందే, కోవిడ్ -19 మహమ్మారి తయారీ, సరఫరా గొలుసులు, డీలర్స్ షిప్స్, మరియు అమ్మకాలకు ఆటంకం కలిగించింది. ఉత్పత్తులు, రహదారులు మరియు రైడర్ సమాజాలపై మోటార్ సైకిల్ బ్రాండ్లను పునఃనిర్మించే యువ కంపెనీ కోసం, ఈ ఆటంకం ఒక ముఖ్యమైన సమయంలో సంభవించింది.

కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన కారణంగా, క్లాసిక్ లెజెండ్స్ తమ ఉత్పత్తులు, ఇంజనీరింగ్, పంపిణీ మరియు యాజమాన్య వ్యవస్థను శక్తివంతం చేయడం కొనసాగించాయి. ఈ సమయం ఉత్సాహం మరియు సామర్థ్యాలను కోరింది, సంస్థ యొక్క ప్రధానమైన సవాలు చేసే స్వభావాన్ని శక్తివంతం చేసింది: పరిస్థితులు ఈ పని చేయడం సాధ్యం కాదని చెప్పినప్పుడు, ముందుకు కొనసాగే మార్గాన్ని కనుగొనాలి.

2022:యెజ్డీ తిరిగి గర్జించింది  

2022లో, భారతదేశంలో ఐడియల్ జావాచే సృష్టించబడి రుస్తోమ్ మరియు ఫర్రోఖ్ ఇరానీచే తీర్చిదిద్దబడిన యెజ్డీ పేరు  తిరిగి రావడంతో ఈ  ప్రయాణం తదుపరి అధ్యాయంలోకి ప్రవేశించింది. 1971లో మొదటిసారి పరిచయం చేయబడిన యెజ్డీ  కఠినత్వం, వ్యక్తిత్వం మరియు సంప్రదాయాలను అనుసరించడానికి   తిరస్కరించడం వంటి అంశాలు ఆధారంగా ఒక ప్రత్యేకమైన భారతీయ గుర్తింపును అభివృద్ధి చేసాయి.

ఇది తిరిగి రావడం అన్వేషణ మరియు సంప్రదాయాలకు మించి వెళ్లే స్వేచ్ఛ ఆధారంగా రూపొందించబడిన రోడ్ స్టర్స్, స్క్రాంబ్లర్స్ మరియు అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ ద్వారా ఈ సవాలు స్ఫూర్తిని కొత్త తరానికి తీసుకువచ్చింది. కేవలం ఒక పేరు తిరిగి రావడానికి మించి, యెజ్డీ మోటార్ సైకిళ్లను మళ్లీ గర్జించేలా చేస్తామని దీర్ఘకాలం ప్రమాణాన్ని దీని రాక నెరవేర్చింది.

2023: ఉత్పత్తులు నుండి రైడర్ ఉద్యమం వరకు

2023 నాటికి, పునరుద్ధరణ మోటార్ సైకిళ్లను మించి వృద్ధి చెందింది. 21వ అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం ఆధునిక మెషీన్లతో పునరుద్ధరించబడిన క్లాసిక్స్ వాహనాలతో పాటు నిలిచి  10,000కి మించిన రైడర్లు, వారసత్వం యజమానులు మరియు అభిమానులను ఒక చోట చేర్చింది.

నోమాడ్స్ కమ్యూనిటీ మరియు రైడర్స్ ఆధ్వర్యంలోని అనుభవాలతో పాటు, ఈ సమావేశం ఈ బ్రాండ్ తరాల మధ్య వారధిగా ఎలా పని చేస్తుందో చూపించింది. ఒక ఉత్పత్తి పునరుద్ధరణగా మారిన ఇది ప్రయాణాలు, స్నేహాలు మరియు పంచుకున్న జ్ఞాపకాలపై మోటార్ సైక్లింగ్ ఉద్యమంగా అభివృద్ధి చెందింది.

2024:భారతదేశానికి తిరిగి వచ్చిన  BSA

2024లో, BSAని భారతదేశానికి తీసుకురావడం ద్వారా  క్లాసిక్ లెజండ్స్ మరొక స్పష్టమైన మైలురాయిని చేరింది. బర్మింఘామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీగా 1861లో బర్మింఘమ్ స్థాపించబడింది, BSA తమ మోటార్ సైకిల్ విభాగాన్ని 1903లో స్థాపించింది మరియు తమ మొదటి మోటార్ సైకిల్ ను 1910లో పరిచయం చేసింది. 1950 నాటికి,  ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడిన ప్రతి నాలుగు మోటార్ సైకిళ్లల్లో  ఒకటి BSA  బ్యాడ్జీతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ సైకిల్ తయారీదారుగా మారింది,

 

గోల్డ్ స్టార్ 650 తమ అసలైన సారాంశాన్ని నిలిపి ఉంచుతూనే సమకాలీన పనితీరు, నమ్మకం మరియు ఇంజనీరింగ్ ను అందించే ఒక ఆధునిక క్లాసిక్ ద్వారా ఈ వారసత్వాన్ని భారతీయ రైడర్స్ కు అందించింది. దీని రాక మూడు-బ్రాండ్స్ పోర్ట్ ఫోలియోలను పూర్తి చేసింది : జావా శాశ్వతమైన డిజైన్ మరియు క్లాసిక్ లక్షణాన్ని సమకాలీన పనితీరుతో కలిపింది; సాహసం మరియు అన్వేషణలపై రూపొందించబడిన సవాలు స్ఫూర్తిని యెజ్డీ ప్రదర్శించింది; మరియు BSA తమ బ్రిటీషు మోటార్ సైకిల్ వారసత్వాన్ని ఉపయోగించి ఆధునిక తరం కోసం ఆధునిక క్లాసిక్ వాహనాలను తయారు చేస్తోంది.

2025–2026: అభివృద్ధి కోసం శక్తివంతం చేయడం మరియు రూపొందించడం

2025 మరియు 2026లో, క్లాసిక్ లెజెండ్స్ పునరుద్ధరణను మించి తమ అభివృద్ధి యొక్క తదుపరి దశ కోసం పునాదులను శక్తివంతం చేయడం ప్రారంభించాయి. దీని పోర్ట్ ఫోలియో రోడ్ స్టర్స్, క్లాసిక్స్, బాబర్స్, స్క్రాంబ్లర్స్ మరియు సాహసవంతమైన మోటార్ సైకిల్స్ రూపంలో విస్తరించింది. ప్రతి బ్రాండ్ తమ విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంది.  ఆర్థిక సంవత్సరం 2025తో పోల్చినప్పుడు కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో  సుమారు 40% వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు సహా, మొత్తం వ్యాపార వృద్ధి 55%గా నిలిచింది.

క్లాసిక్ లెజెండ్స్ తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని సుమారు 1,20,000 మోటార్ సైకిల్స్ నుండి 2026 సంవత్సరం చివరికి 2,00,000 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లను పెంచడానికి కృషి చేస్తోంది. తమ ఇప్పటికే ఉన్న 450 సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్లు యొక్క నెట్ వర్క్ కంటే ఎక్కువగా ఆర్థిక సంవత్సరం 2028 నాటికి ఇది 700 కస్టమర్ టచ్ పాయింట్ల కంటే ఎక్కువగా ఏర్పాటు చేసే లక్ష్యం కలిగి ఉంటూనే భారతదేశం అంతటా అసలైన విడి భాగాల లభ్యతను విస్తరిస్తూ, యాజమాన్య మద్దతును శక్తివంతం చేస్తోంది.

మార్కెట్ సంభావ్యత మరియు ప్రతి బ్రాండ్ యొక్క సంబంధం ఆధారంగా CKD ద్వారా అంతర్జాతీయంగా విస్తరించడానికి కూడా కంపెనీ అవకాశాలను మూల్యాంకనం చేస్తోంది.

అభివృద్ధి కొనసాగుతోంది

కాలక్రమేణా, క్లాసిక్ లెజెండ్స్ దిగ్గజపు బ్రాండ్లను పునరుద్ధరించడమే కాకుండా సంప్రదాయాలను సవాలు చేసిన మోటార్ సైకిల్స్ మరియు విభాగాలను కూడా సృష్టించింది మరియు ఆధునిక క్లాసిక్ మోటార్ సైక్లింగ్ విభాగాన్ని పునః రూపొందించింది. జావా పెరాక్ తో ఫ్యాక్టరీ-కస్టమ్ బాబర్స్ ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం నుండి, యెజ్డీ అడ్వెంచర్ తో అందుబాటులో ఉండే సాహసవంతమైన మోటార్ సైక్లింగ్ ను పునః నిర్వచించడం మరియు BSA గోల్డ్ స్టార్ ద్వారా ప్రామాణికమైన బ్రిటిషు క్లాసిక్స్ ను తిరిగి పరిచయం చేయడం వరకు, ఈ కంపెనీ అన్ని విభాగాల్లో రైడర్ ఎంపికను నిరంతరం విస్తరించింది.

నేడు, జావా యెజ్డీ మరియు BSAలు సంయుక్తంగా క్లాసిక్స్, రోడ్ స్టర్స్, బాబర్స్, స్క్రాంబ్లర్స్ మరియు సాహసవంతమైన మోటార్ సైకిల్స్ లో విస్తరించాయి, ప్రతి బ్రాండ్ విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటూనే మెరుగైన ఇంజనీరింగ్, పనితీరు, టెక్నాలజీ మరియు రైడర్-కేంద్రీకృత ఆవిష్కరణ ద్వారా నిరంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. 


క్లాసిక్ లెజెండ్స్ భవిష్యత్తు దిశగా పయనిస్తున్నప్పుడు, తమ వారసత్వానికి ప్రామాణికంగా ఉండి, ఆధునిక రైడర్స్ కు అనువుగా ఉంటూ, తమ విభాగాల్లో కొత్త ప్రామాణాలను నెలకొల్పగల మోటార్ సైకిళ్లను రూపొందించడంపై దృష్టిసారిస్తోంది. అదే సమయంలో, కంపెనీ ఈ మోటార్ సైకిల్స్ తో సంబంధమున్న యాజమాన్య మరియు కమ్యూనిటీ అనుభవాన్ని శక్తివంతం చేయడం కూడా కొనసాగిస్తోంది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్