హైదరాబాద్‌లో 70 తులాల బంగారం చోరీ

20 నిమిషాల క్రితం

70 tolas of gold stolen in Hyderabad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: నగరంలోని ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ డి-క్లాస్‌లో భారీ చోరీ జరిగింది. మహమ్మద్ వాసిం కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్