ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 116/6

46 నిమిషాల క్రితం

Day 2 play concludes... India's score 116/6
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మరింత కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. నాథన్ స్మిత్ వేసిన 46వ ఓవర్‌ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ (10) స్లిప్‌లో టామ్ లేథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ (7*) క్రీజులో ఉన్నాడు. భారత్ ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది.భారత బ్యాటర్లలో యశస్వి డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ 25, దేవదత్ పడిక్కల్ 21, శుభ్‌మన్ గిల్ 17, రిషభ్ పంత్ 23 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో డఫీ, జేమీసన్ రెండేసి వికెట్లు, హెన్రీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసింది. భారత్ తరఫున ఇంకా ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, గుర్నూర్ బ్రార్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్