ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. 15 మందికి గాయాలు

1 గంట క్రితం

Travels bus rams into a stationary lorry; 15 people injured
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామంజవరం గ్రామ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్