ఫంక్షన్ హాల్‌లో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

2 గంటల క్రితం

Young man dies from electric shock at a function hall
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తుర్కయాంజల్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పరిణయ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తున్న కట్రావత్ రాజేష్ (26) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం రాయిల్లాపురం తండాకు చెందిన రాజేష్ ఫంక్షన్ హాల్‌లో ఫ్రూట్ సలాడ్ విభాగంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధుల్లో ఉండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తోటి సిబ్బంది వెంటనే తుర్కయాంజల్‌లోని తారా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. గిరిజన సంఘాల ప్రతినిధులు, స్థానికులు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్