నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో దీపావళి వేళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా కాల్చిన రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా క్రాకర్స్ పేలి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)