Magazines

ఇబ్రహీంపట్నంలో కల్తీ పాల తయారీ.. ఎస్‌వోటీ దాడులు

28 నిమిషాల క్రితం

Adulterated milk manufacturing in Ibrahimpatnam.. SWOT raids
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌ లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ మహేశ్వరం జోన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న ఆండే శ్రీశైలంను(43) SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీశైలం.. పోచారం గ్రామంలో నివాసం ఉంటూ పాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.


ఈ క్రమంలో100 లీటర్ల కల్తీ పాలతో పాటు1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడి ప్యాకెట్లు 35(ఒక్కోటి కిలో) అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్యలు తప్పని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్