Magazines

ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య 

1 గంట క్రితం

Quality education
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

సర్కారు కళాశాలలో విద్యార్థిలకు ఉచిత యూనిఫాంల పంపిణీ

సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్

నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాణ్యమైన విద్యను  అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా  ఏకరూప దుస్తులను విద్యార్థిని , విద్యార్థులకు ప్రిన్సిపల్ తిరుపతయ్యతో కలిసి అందజేశారు. 


ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం సర్కారు కళాశాలలను అన్ని వసతులతో బలోపేతం చేస్తోందని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ కళాశాలలు నిలుస్తున్నాయని, విద్యార్థులందరిలో సమానత్వ భావాన్ని పెంపొందించేందుకే ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతోపాటు, క్రీడా రంగాలలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, చరణ్ ,సుగ్నేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్