జిల్లా అదన కలెక్టర్ హరిప్రియ
నవతెలంగాణ-మిడ్జిల్
భూముల రీసర్వేకు ప్రజలు, రైతులందరూ సహకరించాలని మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ హరిప్రియ కోరారు. మండలంలోని బైరంపల్లి గ్రామంలో శుక్రవారం భూ రీసర్వేను సర్పంచ్ గోపాలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకొచ్చిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బైరంపల్లిలో మొత్తం భూమి 822 ఎకరాల 23 గుంటల భూమిని రీసర్వే చేస్తారని చెప్పారు.
మొదటగా గ్రామం హద్దులు గుర్తించి, గ్రామకంఠం భూములను గుర్తిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, గైరాన్ భూములను సర్వే చేస్తారు. చివరగా రైతుల పట్టా భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. గ్రామం మొత్తం సర్వే పూర్తి చేయడానికి 30 నుండి 40 రోజుల సమయం పడుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. భూ రికార్డుల పక్కా నిర్వహణ కోసం చేపట్టిన ఈ రీ సర్వే విజయవంతం కావడానికి గ్రామంలోని రైతులందరూ అధికారులకు పూర్తిగా సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఉప తహసిల్దార్ రవి చర్మ, జిపిఓ కొండయ్య, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్, రైతులు శంకర్ నాయక్, జంగయ్య ,రమేష్ ,బీరయ్య ,కాడయ్య, కృష్ణా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)