Magazines

సూడాన్‌లో వైమానిక దాడులు.. 300 మందికిపైగా మృతి

21 అక్టోబర్, 2026

Air strikes in Sudan.. more than 300 people died

Air strikes in Sudan..

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సూడాన్‌ సైన్యం జరిపిన భీకర వైమానిక దాడుల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సూడాన్‌, దక్షిణ సూడాన్‌ మధ్య వివాదాస్పద ప్రాంతమైన అబ్యేలోని మార్కెట్‌పై డ్రోన్‌ దాడిలో 153 మంది మరణించినట్లు సమాచారం. వెస్ట్‌ కొర్దోఫన్‌లోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో మరో 150 మంది మృతి చెందినట్లు ‘సూడాన్‌ వార్‌ అబ్జర్వేటరీ’ తెలిపిందని బీబీసీ కథనం పేర్కొంది. వరుస దాడులతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్