Magazines

కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానం

1 గంట క్రితం

hero suman
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో సుమన్‌తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బండారి
నవతెలంగాణ – నాచారం

చెర్లపల్లిలో ఎస్‌ఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ బెల్ట్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరాటే మల్లికార్జున్ గౌడ్, సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ హాజరయ్యారు. ఇద్దరూ కలిసి కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందడంతోపాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న అకాడమీ నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని హీరో సుమన్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్