నవతెలంగాణ-హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీజీ పోలీసు అకాడమీ సమీపంలోని ఓఆర్‌ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతున్న లారీని.. వెనక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఆటో శంషాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను సురేశ్, పెంటయ్య, లింగరాజుశెట్టిగా గుర్తించారు. ముచ్చింతల్‌లో చెట్లు నాటే పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.






కామెంట్‌లు (0)