Magazines

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌ బెదిరింపులు

3 గంటల క్రితం

Bishnoi gang issues threats to AAP convener Arvind Kejriwal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.7కోట్ల రూపాయల ఇవ్వాలని, ప్రాణాలు తీస్తామని అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు సదురు సందేశం వచ్చింది, కేజ్రీవాల్ నుండి 7 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బు చెల్లించకపోతే, ఆయనను, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు హెచ్చరించాడు.


ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి నుండి ప్రాణహాని, 7 కోట్ల రూపాయల దోపిడీ బెదిరింపులు వచ్చాయని పంజాబ్ పోలీసులు గురువారం తెలిపారు.ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేసిన మొహాలీ పోలీసులు దర్యాప్తును సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్‌కు అప్పగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్