నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి బద్రీనాథ్ వెళ్తున్న బస్సు తెహ్రీ గర్వాల్‌లో నేషనల్ హైవే బ్రిడ్జిపై నుంచి 100 మీటర్ల లోయలో పడిపోయింది. బస్సులో 35 మంది ప్రయాణికులుండగా 8 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సమాచారం అందుకున్న SDRF బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి.







కామెంట్‌లు (0)