నవతెలంగాణ - హైదరాబాద్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. తనకు సైతం నోటీసు వచ్చిందని తెలిపారు. బీజేపీకి నచ్చని ఓట్లను ఏకపక్షంగా తొలగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ తరహాలో ఎన్నికల సంఘాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. స్వతంత్ర వ్యవస్థల్లో కేంద్రం జోక్యం ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొన్నారు.
ఓట్ల తొలగింపునకు కుట్ర: మహేశ్‌కుమార్ గౌడ్
17 అక్టోబర్, 2026

Mahesh Kumar Goud
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)