నవతెలంగాణ-హైదరాబాద్ : కారుపై కంటైనర్ లారీ పల్టీ కొట్టడంతో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని మొహబ్బెవాలా ప్రాంతంలో జరిగింది. యూరియా లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి ఓ కారుని ఢీకొట్టింది. ఆపై కారుపైనే లారీ పల్టీ కొట్టడంతో అందులోని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మిశ్రా కపూర్, అతడి భార్య నిషా ఆనంద్, తల్లి కిరణ్ కపూర్, నీరజ్‌లుగా గుర్తించారు. కారులో ఉన్న మహేర్ కపూర్(6) అనే బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కాగా దీపావళి షాపింగ్ ముగించుకుని సహారన్‌పూర్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారును ఢికొట్టిన కంటైనర్ లారీ..నలుగురు దుర్మరణం
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)