నవతెలంగాణ - హైదరాబాద్ : నేపాల్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కోషి ప్రావిన్స్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టారు.







కామెంట్‌లు (0)