Magazines

ఐపీఎల్‌లోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్...

12 గంటల క్రితం

England all-rounder Ben Stokes to play in IPL...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రూ.2 కోట్ల గరిష్ఠ బేస్ ప్రైస్ కేటగిరీలో ఉన్నాడు. ఈ కేటగిరీలో మొత్తం 30 మంది ఆటగాళ్లు ఉండగా, భారత ఆటగాళ్లు దీపక్ చాహర్, అవేశ్ ఖాన్ మాత్రమే ఉన్నారు. 2025 మెగా వేలానికి దూరంగా ఉన్న స్టోక్స్, ఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో పాల్గొనే అర్హతపై చర్చకు తెరలేపాడు. అయితే బీసీసీఐ ప్రత్యేక అనుమతితో వేలంలోకి వచ్చినట్లు సమాచారం.


ఈసారి వేలం కోసం సుమారు 1,220 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. స్టోక్స్ గతంలో మూడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించి, 45 మ్యాచ్‌ల్లో 935 పరుగులు, 28 వికెట్లు సాధించాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ జాబితాలో డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్, జానీ బెయిర్‌స్టో వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్