Magazines

పాకిస్థాన్ సరిహద్దు రాజస్థాన్‌లో రైల్వేట్రాక్‌పై పేలుడు

1 గంట క్రితం

Explosion on railway track in Rajasthan, Pakistan border
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు, రాజస్థాన్‌లో గంగానగర్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు వల్ల అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. రాత్రి 9 గంటలకు అనూప్‌గఢ్ నుంచి సూరత్‌గఢ్‌కు వెళ్లే రైలు వెళ్లిన 45 నిమిషాల తర్వాత ఈ పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తప్పింది. దీనిపై దర్యాప్తునకు ఉగ్రవాద నిరోధక దళం, నేర పరిశోధన విభాగం, డాగ్ స్క్వాడ్, భద్రతా సంస్థలు, రైల్వేబృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్