Magazines

మెహిదీపట్నం కింగ్స్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

1 గంట క్రితం

Major fire breaks out at Mehidipatnam Kings Restaurant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎక్స్‌ రోడ్‌ వద్ద ఉన్న ప్రముఖ కింగ్స్‌ రెస్టారెంట్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు వ్యాపించకుండా తీవ్రంగా శ్రమించారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్